Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీస్ శాఖలో ఉత్తమ సేవ లు అందించిన పలువురి అధికారు లకు రాష్ట్ర అవతరణ దినోత్సపం సందర్భంగా ప్రభుత్వం అవార్డుల ను ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం ఇద్దరికి ప్రకటిచంగా అందులో ఒకరు నగర పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వై. రాంరెడ్డి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు, పోలీసు లకు మధ్య వారధిగా టెక్నాలేజీని నిలిపారు. పోలీస్ శాఖ లో అంతర్గత సేవల కోసం ఎన్నో సంస్కరణలను తీసుకొ చ్చారు. 1998 బ్యాచ్‌కు చెందిన రాంరెడ్డి 2014లో నుంచి ఐటీ విభాగంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలను రాబట్టడంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్య ంగా నగర కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూం, ట్రాఫిక్ కంట్రోల్ రూం వేదికగా వీడియో ఎన్ఫోర్సుమెంట్ సెల్, సోషల్‌మీడియా సెల్, సిటీజన్స్ ఫీడ్‌బ్యాక్ సెంట ర్‌తోపాటు పోలీస్ శాఖలో అందుబాటులో తీసుకొచ్చిన వివిధ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పోలీస్ శాఖలు అమలు చేస్తున్నా టెక్నాలేజీని మరింత అభివృద్ధి చేయడంలో ముందు వర సలో నిలిచారు. పోలీస్ శాఖలో మంచిపేరు ప్రతిష్టలను సంపాదించారు. నిబద్ధతతో పని చేస్తూ మరిన్ని పురస్కా రాలు అందుకోవాలని ఉన్నతాధికారులు ఆకాంక్షిచారు. తోటి ఉద్యోగులు, స్నేహితులు ఇన్స్పెక్టర్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.