Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి టీకా షురూ
- గ్రేటర్ పరిధిలో 2 లక్షల మంది గుర్తింపు
- పది కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
- ఆధార్, లైసెన్స్, ఆర్సీ తప్పనిసరి
నవతెలంగాణ-సిటీబ్యూరో
సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేప థ్యంలో నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఆటో డ్రైవర్లు, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వైద్యశాఖ సహకారంతో రవాణాశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరి ధిలో మొత్తం పది కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకోనే వారు నేరుగా టీకా కేంద్రాలకు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ వెంట తెచ్చుకోవాలని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్‌లోని మూడు జిల్లాలో పరిధిలో ఆటో, ట్యాక్సీ, మాక్సీ డ్రైవర్లను సుమారు 2 లక్షల వరకు ఉంటారని రవాణాశాఖ అంచనా వేసింది. వీరందరు నిత్యం ప్రయాణీకులతో మమేకమై హై రిస్క్ టీం జాబితాలో ఉన్నారు. సూపర్ స్పై డర్ల వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వీరి కోసం మొత్తం మూడు జిల్లాలో పరిధిలో పది వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైద రాబాద్ పరిధిలో 6, రంగారెడ్డిలో 2, మేడ్చల్ జిల్లా పరిధిలో 3 కేంద్రాలను గుర్తించారు. సద రు కేంద్రాలకు రవాణాశాఖకు చెందిన ఆర్టీవో లను ఇన్చార్జిలుగా నియమించింది. ప్రతిరోజూ సుమారు వెయ్యి మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా ప్లాన్ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సేవలు కొనసాగుతాయి. ముందుగా నమోదు చేసుకుని వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చే ఆటో, క్యాబ్, మాక్సీ డ్రైవర్స్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఆర్.సి జిరాక్స్ కాపీ తీసుకురావల్సి ఉం టుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు సం బంధిత ప్రాంతల్లోని ఆర్టీవో కార్యాలయాల వెళ్లినా అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రి యను పూర్తి చేస్తారు.
జిల్లా టీకా కేంద్రం హైదరాబాద్ రాజ్‌భవన్ స్కూల్ సోమాజిగూడ
హైదరాబాద్ ప్రభుత్వ స్కూల్, మారెడుపల్లి
హైదరాబాద్ స్వామి వివేకానంద స్కూల్, ముసారాంబాగ్
హైదరాబాద్ ప్రభుత్వ ఐటీఐ బహుద్దూర్‌పుర
హైదరాబాద్ ప్రభుత్వ ఐటీఐ మల్లెపల్లి
రంగారెడ్డి హైటెక్స్ కొండాపూర్
రంగారెడ్డి జేడ్పీ హైస్కూల్ రాగన్న గూడ
మేడ్చల్ శివ శివాణీ స్కూల్ కొంపల్లి
మేడ్చల్ జాన్సన్ గ్రామర్ స్కూల్ మల్లాపూర్
మేడ్చల్ విజ్ఞాన విద్యాలయం నిజాంపేట్
డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత వ్యాక్సినేషన్‌ను డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలి. జీహెచ్ ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల్లోని ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నేటి నుంచి ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. రవాణా, వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో 10 కేంద్రాలను గుర్తిం చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డ్రైవర్లందరి శ్రేయస్సు దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది.
డాక్టర్ కె.పాపారావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, రవాణాశాఖ