Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఆదేశాలు మిల్లర్లు బేఖాతరు - ఆందోళనలో రైతులు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ఆరు గాలం కష్టపడి పండించిన పంట ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడంతో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం నీట మునిగింది. అబ్దుల్లాపూర్మెట్ మండలం, గౌరెల్లి, బాచారం, బండరావిరాల గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నత్తనడకన నడుస్తున్న ధాన్యం కొనుగోలు గత రెండు/ మూడు రోజులుగా నిలిపివేసినట్లు సమాచారం. దింతో ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి ధాన్యం చెల్లాచెదురైంది. కళ్ళాలల్లో మగ్గుతున్న ధాన్యంను కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీి మిల్లర్లు కొనుగోలుచేయకపోవడంతో ధాన్యం కళ్ళాలల్లో మగ్గుతున్నాయి. మిల్లర్లలో ధాన్యం నిండుకుండడంతో ధాన్యం కొనుగోలు చేయడానికి మిల్లర్లు ముందుకు రాకపోవడంతో కళ్ళాలల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. దీంతో అకాల వర్షానికి ఆరు గాలం కష్టపడి పంట కళ్ల ముందే నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.