Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ ఉద్యమ చరిత్రను రికార్డు చేసేందుకు పోరు తెలంగాణ చానల్ ను ప్రారంభించడం అభినందనీయ మని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం అన్నారు.పోరు తెలంగాణ యూట్యూబ్ చానల్ లోగోను తార్నాక లో కోదండరాం ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ మానుకోట వాస్తవ్యుడు అయినప్పటికీ హైదరాబాద్లోని ఏపీ కాలేజీలో పీజీ డిప్లొమా చేసి తాను నేర్చుకున్నటువంటి చదువును ఉపయోగించి ఇవాళ తెలంగాణ రికార్డును డాక్యుమెంట్ చేసి పోరు తెలంగాణ యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రజలకి చేరవేయాలని ప్రయత్నం చేస్తున్నాడని, ఇది చాలా గొప్ప ప్రయత్నం అని తెలిపారు. రాజేంద్రప్రసాద్ తెలంగాణ చరిత్రని డాక్యుమెంటరీ చేయటం కోసం పూనుకోవడం అభినదనియం అని అన్నారు.