Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8.50 లక్షల మందికి వ్యాక్సిన్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి
పువ్వాడ అజరుకుమార్ వ్యాక్సినేషన్ కేంద్రం సందర్శన
నవతెలంగాణ-ఉప్పల్/ఏఎస్రావు నగర్
అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా ఇస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. మ్యాక్సీ క్యాబ్స్, మినీ వ్యాన్స్, ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా 10 వాక్సినేషన్ సెంట ర్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. శుక్రవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలిసి సంద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అజరు కుమార్ మాట్లాడుతూ సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సినేషన్ భాగంగా ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు టీకాలు ఇస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం నిత్యం వంద లాది మందితో కలుస్తుండటం కారణంగా, వైరస్ వ్యాప్తి కారకులు కాకూడదనే ఉద్దేశంతో వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయి ంచినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం విజయవం తంగా సాగుతోందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ ల్ జిల్లాల్లో 10 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే తక్షణమే రవాణా శాఖ వెబ్ సైట్ (ుతీaఅరజూశీత్ీ సవజూaత్ీఎవఅ్)లో నమోదు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో 3 లక్షల పైచిలుకు ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారనీ, ఇందులో 2 లక్షలా 25 వేల మంది ఆటో డ్రైవర్లు, లక్షా 10 వేల మంది క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లుండగా అందరికి టీకాలను ఇవ్వనున్నట్టు పేర్కొన్నా రు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌ని వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అనంతరం వరం గల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం తదితర జిల్లాలు, మున్సిపాలిటీల్లో వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ఏర్పా టు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8.5 లక్షల మంది ఈ రంగంలో సూపర్ స్ప్రెడర్స్‌గా ఉన్నారనీ, వారం దరికీ టీకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్ర మంలో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఎంఆర్ఎం రావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాపారావు, ఆర్టీఓ రవీందర్, ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్, ఆర్టీవో రవీందర్ కుమార్‌గౌడ్, నాచారం సీఐ కిరణ్ కుమార్, మల్లాపూర్ డివిజన్ కార్పొ రేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి, నాచారం డివిజన్ నాయ కులు సాయి జైన్ శేఖర్, డాక్టర్ స్వప్నిక, వైద్య సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, వేముల సంతోష్‌రెడ్డి, మారయ్య, కట్ట బుచ్చన్న గౌడ్, అంజి, తదితరులు పాల్గొన్నారు.