Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రి ఎదుట ధర్నా
నవతెలంగాణ-బాలానగర్
రోగుల దగ్గర ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న ప్రయివేటు, కార్పొరేటు ఆస్ప త్రులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్ డిమాండ్ చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నిజాంపేట్ రోడ్‌లోని శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రి ఎదుట శుక్రవారం డీివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజరు కుమార్ మాట్లాడుతూ హోలిస్టిక్ హాస్పిటల్లో కరోనా రోగుల నుంచి అక్రమంగా ఆధిక ఫీజు లు వసూలు చేస్తున్నారనీ, హాస్పిటల్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. కారోనా కష్ట కాలంలో ప్రజలకు సేవ చేయాల్సిన ఆస్పత్రి యాజమాన్యం రూ. లక్షలో ఫీజులు వసూళ్లు చెయ్యడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ప్రయివేటు హాస్పిట ల్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోలిస్టిక్ హాస్పిటల్ పర్మిషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలు, మహేష్, శ్రీను, తది తరులు పాల్గొన్నారు.