Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
నియోజకవర్గంలోని డివిజన్లను దశల వారీగా అభి వృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శుక్రవారం వినాయకనగర్ డివిజన్లో రూ.కోటీ 40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న భూగర్భ బాక్స్ డ్రెయినేజీ పనులను కార్పొరేటర్ రాజ్యలక్ష్మితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం దీన్ దయాల్ నగర్ కమిటీ హాల్లోని అదనపు గదులను ప్రారంభించారు. సోమయ్య ఎంక్లేవ్ కాలనీవాసులు డ్రెయినేజీ, రోడ్ల సమ స్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తక్షణ మే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశిం చారు. అనంతరం నేరెడ్మెట్ డివిజన్లోని భగత్ సింగ్‌న గర్‌లో రూ.12 లక్షల వ్యయంతో భూగర్భ డ్రెయినేజీ పనులను కార్పొరేటర్ మీనా ఉపేందర్‌రెడ్డితో కలిసి ప్రారం భించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనుల ను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈ స్వర్ణ, ఏఈ సజన, ఏఈ స్వరూప, టీఆర్ఎస్ నాయకులు బద్ధం పరశురామ్రెడ్డి, రావుల అంజయ్య, ఉపేందర్‌రెడ్డి, చెన్నారెడ్డి, సాయికుమార్, జీఎన్వీ సతీష్ కుమార్, రాము యాదవ్, గుండా నిరంజన్, పిట్ల శ్రీనివాస్, ఫరీద్, బాల కృష్ణ, అరుంధతి, బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, మంగేష్, గోపాల కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.