Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
కరోనా మహమ్మారితో అనేక కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదు ర్కొంటున్నాయనీ, వారిని ఆదుకునేందుకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ బి.పద్మా వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం బాగ్ అంబర్పేట డివిజన్లోని కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో వెంటాడుతుందన్నారు. కరోనా సోకి ఎన్నో కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయనీ, వారిని ఆదుకునేందుకు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మాజీ అధ్యక్షుడు బి.వెంకట్రెడ్డి, బాగ్ అంబర్పేట డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కోడూరి సురేష్, బాగ్ అంబర్పేట డివిజన్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సునంద, తదితరులు పాల్గొన్నారు.