Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణలో భాగంగా దాదాపు కోటి రూపాయల విలువైన హెల్త్ కిట్లను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డిలు పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రూ.4,133 విలువైన ఒక్కో హెల్త్ కిట్‌ను 2,374 మందికి తొలిదశలో పంపిణీ చేశారు. ఒక్కో కిట్‌లో 56 మాస్క్‌లు, రేడియం సేఫ్టీ జాకెట్, రెయిన్‌కోట్, రెండు జతల గ్లౌసెస్, ఒక జత బూట్లు, 40 సబ్బులు, ఒక టవల్, క్యాప్, మూడు శానిటైజర్ బాటిళ్లు, రెండు లీటర్ల కొబ్బరి నూనె, ఒక కిట్ బ్యాగ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సేఫ్టీకిట్లను ధరించాలి
వర్షా కాలం ప్రవేశిస్తున్న దష్ట్యా స్వీయ ఆరోగ్య పరిరక్షణకు ప్రతి కార్మికుడూ విధిగా సేఫ్టీ కిట్లను ధరించి విధులకు హాజరు కావాలని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. కార్మికులకు సేఫ్టీ కిట్లను డిప్యూటీ మేయర్‌తో కలిసి పంపిణీ చేసిన సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా రూ.98.10లక్షల విలువైన కిట్లను అందజే శామని వివరించారు. ఖరీదైన ఈ కిట్లను తప్పనిసరిగా వాడాలని అన్నారు. కరోనా నుంచి కాపాడేందుకు ఇప్పటికే కార్మికులందరికీ ప్రత్యేకంగా వాక్సిన్ ఇప్పించామని అన్నారు.