Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
కరోనా బాధిత కుటుంబాలను మానవతా హదయంతో ప్రతి ఒక్కరు ఆదుకోవాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్ ్గూడలోని 24వ డివిజన్లో నివాసం ఉన్న కరోనా బాధిత కుటుంబ సభ్యులకు డ్రై రేషన్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం మేరకు మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ గ్రామం డివిజన్ జయశంకర్ కాలనీలో నివాసముండే నిరుపేద మూడు కుటుంబాలకు డ్రై రేషన్ అందజేసిన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి స్థానిక కార్పొరేటర్ ఏనుగు రామ్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విలయ తాండవం చేసి సమాజంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ఎంతో కషి చేస్తుందని, ప్రజలు లాక్ డౌన్‌కు సహకరించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మారి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సాంబశివ, శివానిరెడ్డి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 24వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. కార్యక్రమంలో మాట్లాడుతూ మౌలిక వసతుల ఏర్పాటులో మన కార్పొరేషన్ ముందు వరుసలో ఉందని అన్నారు. అనంతరం అక్కడే జయశంకర్ కాలనీలో నివాసముండే నిరుపేద మూడు కుటుంబాలకు డ్రై రేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి, ఏఈఈ బిక్కు నాయక్, నాయకులు ముత్యాల కష్ణ, మారి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సాంబశివ తదితరులు పాల్గొన్నారు.