Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ సేవాపతకం అందుకున్న వారికి ఘనంగా సన్మానం
- ఈ ఏడాది 35కి పతకాలు : రాచకొండ సీపీ మహేష్‌భగవత్
నవతెలంగాణ-సిటీబ్యూరో
అత్యుత్తమ సేవలందించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం సేవాపతకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాచకొండ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరికి అత్యుత్తమ సేవా పతకాలు రాగా, 33 మందికి సేవా పతకాలు లభించాయి. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్‌లో
శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ మహేష్ భగవత్ పతకాలు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో పనిచేస్తున్న 35 మంది పోలీస్ సిబ్బందికి సేవాపతకాలు లభించాయని తెలిపారు. ఐదేండ్ల కాలంలో ఒకేసారీ 35 పతకాలు రావడం ఇదే మొదటి సారి అని సీపీ తెలిపారు. ఏఆర్ఎస్ఐ ఎన్.సత్యా వరప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ పి.సుబ్బారెడ్డిలకు ఉత్తమ సేవా పతకాలు లభించాయని తెలిపారు. మరింత ఉత్సాహంతో పనిచే యాలని ఆకాంక్షించారు. పతకాలు, అవార్డులు, రివార్డ్స్ లభించడంతో ఎంతో ప్రొత్సాహం లభిస్తుందన్నారు. వాటి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరు బాధ్యతగా, పారదర్శ కంగా, జవాబుదారీ తనంతో పనిచేయాలని సూచించారు. ప్రతి రోజు నూతన ఉత్సాహం, కొత్త ఛాలెంజ్‌తో పనిచేయా లని కోరారు. అవార్డులు సేవకు మంచిగుర్తింపని అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. పతకాలను సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. బహుమతి లభించిందా లేదా అనేదానితో సంబంధం లేకుండా పనిచేయాలన్నారు. యూనిఫామే పెద్ద బహుమతన్నారు. పోలీస్ శాఖ ఒక కుటుంబం లాంటిదని, పనిచేస్తున్నవారందరూ కుటుంఙ సభ్యులేనని తెలిపారు. మనం చేసే పనిని ప్రజలు గమని స్తారన్నారు. ఇతరులకు మార్గదర్శకంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో డీసీపీలు రక్షిత, శిల్పవల్లీ, అదనపు డీసీపీ ఏఆర్ షమీర్తోపాటు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్.భద్రారెడ్డితోపాటు క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.