Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ సివిల్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న 7 మంది న్యాయవాదులు కరోనా బారిన పడి మత్యువాతకు గురయ్యారు. ఈ నేపధ్యంలో శుక్రవారం నాడు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టు ప్రాంగ ణంలో మత్యువాత సంతాప సభ నిర్వహించారు. చనిపోయిన న్యాయ వాదు లకు ఆత్మకు శాంతి కలగాలని కోరుతు కొవ్వొత్తులను వెలిగించి సంతాపం కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ విపత్తర పరిస్ధితిలో న్యాయ వాదులు తమ ఆరోగ్యా లను కాపడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, హైకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కోర్టులో సంతాపం,శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించా మని సికింద్రాబాద్ కోర్టు బార్ అసోసియోషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ చెప్పారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో కోర్టు బార్ అసోసియేషన్ శ్రీకాంత్, ప్రభుత్వ అదనపు ప్లీడర్, సీనియర్ న్యాయవాది గోలి దేవేందర్ బాబు, సభ్యులు టివి రమణ, రమేష్, రాజేష్ వినోద్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.