Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి
- ఉప్పల్, మల్కాజిగిరి వ్యాక్సినేషన్ కేంద్రాల్లో పరిశీలన
నవతెలంగాణ-ఉప్పల్
అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందనీ, ఈ విషయంలో విడతల వారీగా అందరికీ వ్యాక్సిన్ అందచేస్తామనీ, ఇందుకు ప్ర జలు ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండా లని మేడ్చల్-మల్కాజిగిరి ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహ ంతి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఉప్పల్, మల్కాజి గిరిలోని వినాయకనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ఈ సదర్భంగా వ్యాక్సినేషన్ ఎలా అంద జేస్తున్నారు? వ్యాక్సినేషన్ వేస్తున్న తీరు, ఎంత మంది సిబ్బంది వచ్చారన్న వివరాలను సిబ్బందిని అడిగి తెలు సుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వం సూచించిన మేరకు జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రజలకు అందుబాటులో ఉన్న చోట్ల వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, ఇప్పటికి ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారు తమకు దగ్గ రలో, అందుబాటులో ఉన్న కేంద్రాలకు వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అలాగే కరోనా వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకాలు ఎలా వేస్తున్నారు? ఏమైనా ఇబ్బందు లు ఉన్నాయా? వ్యాక్సినేషన్ సిబ్బంది తీరు ఎలా ఉంది? అనే వివరాలను టీకాలు తీసుకునేందుకు వచ్చిన వారిని కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. ఈ విష యంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయాలని పేర్కొన్నారు. ఆయా వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద టీకాలు ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లు? కేంద్రాల వద్ద వసతులు? ఇప్పటి వరకు ఎంత మందికి టీకాలు ఇచ్చేందుకు గుర్తించారు? ఎంత మందికి టీకాలు ఇచ్చారు? అనే వివరాలను అక్కడ ఉన్న వైద్యా ధికారులు, సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో వైద్య సిబ్బ ందికి ప్రజలు సహ కరించాలనీ, మొదటి డోసుగా కరోనా టీకా ఇచ్చిన తర్వాత రెండో డోసు ఎప్పుడు ఇస్తారనే వివరా లను వారికి తెలియజేయాల్సిందిగా కలెక్టర్ శ్వేతా మహంతి వైద్యాదికారులు, సిబ్బందికి సూచించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జు న్‌రావు, ఉప్పల్ తహశీల్దార్ గౌతమ్‌కుమార్, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
పాజిటివ్ వచ్చినా అధైర్యపడొద్దు
కరోనా పాజిటివ్ సోకిన వారు ఏమాత్రం అధైర్య పడకుండా ఉండాలనీ, వారికి ప్రభుత్వం మంచి వైద్యం అందిస్తోందని మేడ్చల్ ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. శుక్రవారం ఉప్పల్‌లోని మోడల్ మార్కెట్లో ఉన్న టెస్టింగ్ కేంద్రానికి స్వయంగా వెళ్ళిన కలెక్టర్ అక్కడి ఆవరణలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఏమాత్రం అధైర్యపడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. వారి కుటుంబ సభ్యులు సైతం భయాందోళనకు గురి కాకుండా ఉండాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వం నాణ్యమైన చికిత్సతోపాటు అన్ని రకాల మం దులు అందచేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా టెస్టి ంగ్ సెంటర్లో పాజిటివ్ వచ్చిన వారికి కలెక్టర్ స్వయ ంగా మెడికల్ కిట్లను అందజే శారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు, ఉప్పల్ తహశీ ల్దార్ గౌతమ్, తదితరులు ఉన్నారు.