Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ఎస్.ఎం సెహగల్ పౌండేషన్ ఆధ్వర్యం లో జిల్లాలో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందికి తమవంతు సాయంగా పీపీఈ కిట్లు, ఎన్- 95 మాస్కులు, శానిటైజర్లను శుక్రవారం మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహం తికి అందజేశారు. సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 480 పీపీఈ కిట్స్, ఎన్-95, 400 మాస్కులు, 4 వేల సర్జికల్ మాస్క్‌లు, 4000 హ్యండ్ గ్లౌజ్‌లు, ఐదు లీటర్ల గల శా నిటైజర్, 96 క్యాన్లను ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి అందజేశారు. ఈ సందర్భంగా కల ెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు సేవలందిచేందుకు ఎంత గానో కృషి చేస్తోందన్నారు. అందుకు తోడు తమవంతు సాయంగా ఎస్.ఎం సెహగల్ పౌండేషన్ ఉదారతతో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిత్యం చేస్తున్న సేవలను గుర్తించడం ఎంతో అభినందనీయమనీ, వారి సేవలు ఎప్పటికీ మరువలేనవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మల్లిఖార్జున్‌రావు, జెడ్పీ సీఈఓ దేవ సహాయం పాల్గొన్నారు.