Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య
- సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత
నవతెలంగాణ-తుర్కయాంజల్
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలబడుతోందని డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. తుర్క యంజాల్ శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన నేతి మహేష్‌కు రూ.40వేలు, వాసవీనగర్ కాలనీకి చెందిన ఎన్.నిర్మలకు రూ.40వేలు సీఎం సహాయ నిధి చెక్కులను సత్తయ్య శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్టు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందుతున్న డబ్బులతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుకునే వీలు కలుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేసీఆర్ కిట్ పథకంతో పేదల మన్ననలు పొందినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ వైస్ చైర్మెన్ కందాడ ముత్యంరెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, తుర్కయంజాల్ కౌన్సిల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్‌నాయక్, టీఆర్ఎస్ నాయ కులు పుల్లగుర్రం విజయానంద్‌రెడ్డి, గుండా ధన్‌రాజ్, మాజీ సర్పంచ్ దశరథ, 21వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు వీరస్వామిగౌడ్, 10వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు చెక్క బాలనర్సింహ, జేఏసీ అధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు జొన్నాడ సుదర్శన్‌రెడ్డి, కల్లూరి నిరంజన్‌రెడ్డి, నల్లవెల్లి కార్తీక్, మేతరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.