Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- 221 మంది లబ్దిదారులకు చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
ఆడపిల్లలకు అపురూప కానుక కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పేద కుటుంబాలకు ఆర్ధిక భారంగా కావద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి కానుకగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు. రూ.లక్ష నూటా పదహారు చెక్కు ను అందించడంతో పేదల ఇంట్లో వెలుగులు జిమ్ముతున్నా యని చెప్పారు. శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేం ద్రంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ సైదులు ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పేద ప్రజలకు అనేక సంక్షేమ పథ కాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజ కవర్గంలో అర్హులైన పేదలకు రూ.ఐదు కోట్లా యాభై లక్షల చెక్కులను నియోజకవర్గ స్థాయిలో వారం రోజులుగా పంప ిణీ చేస్తున్నామనీ, ఇందులో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో 221 మంది లబ్దిదారులకు సుమారుగా రూ.2.21 కోట్ల చెక్కులను అందజేసినట్టు తెలిపారు. పేదింటి ఆడపిల్లలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందనీ, అందుకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తామని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న మున్సిపాల్టీలు, గ్రామాలు శరవేగంగా అబి óవృద్ధి చెందుతున్నాయన్నారు. ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్నీ అర్హులైన పేదలు పొందాలన్నారు. ఈ కార్యక్రమ ంలో జిల్లా రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం పట్నం ఆర్డీవో, తహసీల్దార్ సైదు లు, పెద్ద అంబర్‌పేట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న చిరం జీవి, వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్‌రెడ్డి, ఎంపీపీ రేఖ మహేందర్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.