Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పించన్ పరేషాన్ ఎన్నాళ్లు?
- సంవత్సరం నుంచి మంజూరు కాని కొత్త పింఛన్
- ఉసేలేని కొత్త రేషన్ కార్డ్స్
- మరణించిన పింఛన్దారుల వివరాలు ఇవ్వండి అ తహసీల్దార్ సునీల్ కుమార్
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే పింఛన్దారులకు ఇస్తున్న నగదు పెంచాము, పైగా ఒంటరి మహిళలకు కూడా మేమే తొలిసారిగా పించన్లు ఇస్తున్నాము అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గత సంవత్సరం కాలం నుండి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మారేడుపల్లి తహసీల్దార్ కార్యాలయం పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా నూతనంగా పించన్లు మంజూరు చేయకపోవడం పించన్ దారులు నిత్యం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఆయ్యా పింఛన్ ఎప్పుడు వస్తుంది?
ఇక్కడ మారేడుపల్లి తహసీల్దార్ కార్యాలయం పరిధిలో ఒక సంవత్సరాము కాలం నుండి 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు వివిధ రకాలైన పింఛను కోసం 800 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో 600 మంది అర్హులైన వారిని ఎంపిక చేసి సదరు జాబితను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు అమెదించగా కలెక్టర్ కార్యాలయం నుండి ''సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ''
(సెర్ఫు), అర్హులైన వారి జాబితా వెళ్లగా, నేటి వరకు సెర్ఫ్ ఒక్క లబ్ధిదారునికి కూడా నూతన పింఛన్ కూడా మంజూరి చేయకపోవడంతో నిత్యం సదరు దరఖాస్తులు చేస్తున్న వద్ధులు, వితంతవులు, దివ్యంగులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అక్కడ ఉన్న అధికారులను అరా తీస్తూ తమ గొడువేళ్ళ బోసుకుంటు న్నారు. మరి కొందరు అయితే బిడ్డ మాకు పూట గడవటం కష్టంగానే ఉంది ఇంట్లో వాళ్ళు చిన్నచూపు చూస్తున్నారు, మాకు పింఛన్ త్వరగా వచ్చేలా చూడు బిడ్డ్డా అంటూ స్థానిక కార్పొ రేటర్లకు, తమకు పరిచయం ఉన్న వివిధ పార్టీల నేతలకు, చోటామోట నేతలకు మొరపెట్టుకుంటు న్నారు. ఎవరో ఒకరు దయ చూపరా? మాకు పింఛన్ రాదా అంటూ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. మాకు చావు దగ్గరకు వస్తుంది, పింఛన్ అందటం లేదని ఆశావహులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రస్తుతానికి మారేడుపల్లి తహసీల్దార్ కార్యాలయం నుండి 9 వేల 300 మంది వివిధ రకాలైన పింఛన్స్ నెల వారీగా పొందుతున్నారు. మరోవైపు గత కొన్ని నెలలుగా పెండింగులో ఉన్న, నిలిచిపోయిన పనులు ముమ్మరంగా చేస్తున్న విషయం తెల్సిందే. గత సంవత్సరం కాలం నుండి పెండింగులో ఉన్న పింఛన్లు ఎంత వరకు మంజూరి చేస్తోందో అని పింఛన్ ఆశావహులు వేచి చూస్తున్నారు. మరోవైపు అసలు పింఛన్ వస్తుందో రాదో అంటూ కొందరు వద్ధులు మధనపడుతునట్లు స్థానికులు ఆరోపిస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఎన్నికల కోడ్ సాకుతో ఇన్నాళ్లు ఇలా పింఛన్దారుల సాకు చెప్పిన ఇకపై జాప్యము లేకుండా పింఛన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పింఛన్దారులు వాపోతున్నారు.
కొత్త రేషన్ కార్డ్స్ ఎదురు చూపులు
ఇక కొత్త రేషన్ కార్డ్స్ కోసం వేలాదిమంది దరఖాస్తులు వచ్చాయి. వారిలో కూడా అనేక మంది అర్హులు ఉన్నారు. వారికి వివిధ రకాల పథకాలకు అన్ని రకాల అర్హతలు ఉన్న తెల్లరేషన్ కార్డులు లేక వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే తెల్ల రేషన్ కార్డ్స్ అర్హులైన వారికి అందజేయాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరణించిన ఫించన్దారుల సమాచారం ఇవ్వండి
మారేడుపల్లి తహసీల్దార్ సునీల్ కుమార్
ఇక్కడ వివిధ రకాలైన పింఛన్లు ప్రస్తుతానికి పొందుతున్న పింఛన్ దారులు ఎవరైనా మరణిస్తే తప్పకుండా కుటుంబ సభ్యులు సదరు పింఛన్ పొందుతూ మతి చెందిన వ్యక్తుల ఆధార్ కార్డ్, డెత్ సర్టిఫికెట్స్ తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తే దీనివల్ల అర్హులైన పింఛన్దారులకు పింఛన్స్ వస్తాయి అని తహసీల్దార్ సునీల్ సూచించారు. మరోవైపు వివిధ సర్టిఫికెట్స్ కూడా ఇన్ టైమ్లో ఇచ్చేందుకు తమ కార్యాలయంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు అని చెప్పారు. కొత్తగా పింఛన్స్ మంజూరి కాగానే అర్హులకు అందజేస్తామన్నారు.