Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందజేసిన శ్రీ గణేష్ పౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బొల్లారం ఆసుపత్రి అభివద్ధి కోసం శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్ శనివారం కంటోన్మెంట్ సిఇఓ అజిత్ రెడ్డికి రెండున్నర లక్షల రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు. అనంతరం శ్రీగణేష్ బోర్డు కార్యాలయంలో మాట్లాడుతూ.. కంటోన్మెంట్లో ఉన్న ఏకైక 50 పడకల కంటోన్మెంట్ ఆసుపత్రి అన్నారు. అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాతలు ముందుకు విరాళాలు ఇవ్వాలని కోరారు. కంటోన్మెంట్ సీఈఓ కోరిక మేరకు ఎబిజి మెషిన్, ఆక్సిజన్ మెషిన్ కోసం ఆర్ధిక సహాయం అందించినట్లు తెలిపారు. డిస్పెన్సరీగా ఉన్న ఆస్పత్రి ఇప్పడు 24 గంటల కొవిడ్ ఆస్పతిగా పనిచేస్తుందన్నారు.