Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని నేరేడ్మెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కటికనేని శ్రీదేవి అన్నారు. శనివారం సరస్వతి ఫంక్షన్ హాల్లో ఆటో కార్మికులకు, మెకానిక్‌లకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్క్‌లను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైరస్ నిర్మూలనకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీకే హనుమంతరావు, ఆర్కే శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, శంకర్రావు, శ్రీనివాస్, బాబురావు, రోహిన్, విక్రమ్, సురేష్, నరేష్, సూర్యారావు, శివ కుమార్, సాయి, ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.