Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కాప్రా సర్కిల్ పరిధిలోని బందావన కాలనీ ఫేజ్-2లో నివసించే ఆయిల సాంబమూర్తి కోవిడ్ బారినపడి మే నెల ల మతి చెందారు. భార్య మహిమలత సైతం కోవిడ్ బారినపడి చని పోయారు. వారం వ్యవధిలోనే అమ్మానాన్న కన్ను మూయడంతో కుమార్తెలు సుశ్మిత, హర్షిత రోదన పలువురిని కలిచి వేసింది. . 20 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయిందని కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇంటి అద్దె చెల్లించలేని దుర్భర జీవి తాన్ని గడుపుతున్నారు. ఇటీవల పత్రికలలో వచ్చిన వార్తల ద్వారా విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి పద్మ తక్షణ సహాయం కింద సుష్మిత, హర్షిత లకు 20 వేల రూపాయలు, నిత్యవసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ స్వాతి, సఖి ఇన్చార్జ్ పావని, సూపర్వైజర్ పద్మ, ఇంచార్జ్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సైధులు, అంగన్వాడీ టీచర్ అంజుమ్ తదితరులు పాల్గొన్నారు.