Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం
నవతెలంగాణ-మెహిదీపట్నం
తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలు స్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నా రు. మెహిదీపట్నంలోని ఆసిఫ్ నగర్లో నూతనంగా నిర్మిం చిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శనివారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజేపీ మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమనీ, అందుకే సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అధునాతన సౌకర్యా లతో నూతనంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూం నిర్మాణం జరుగుతుందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానా న్ని ఉపయోగించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసుల కంటే ముందంజలో ఉన్నారని కొనియాడారు. హైదరాబాదులో నేరాల శాతం గణనీయం గా తగ్గిందన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వా లని సీఎం కేసీఆర్ తనకు చెప్పారని తెలిపారు. సీఎం ఆధ్వ ర్యంలో నేరాలను అరికట్టడంతోపాటు పోలీసు శాఖలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర వినూత్న మార్పులు తెచ్చి దేశం లోనే ఆదర్శంగా నిలిచినట్టు వివరించారు. ఈ కార్యక్ర మంలో పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.