Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
- లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-దుండిగల్
కరోనా కొనసాగుతున్నా, ఎంతటి విపత్తులు ఎదురవు తున్నా ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థి తుల్లో ఆగేది లేదనీ, పేద ప్రజలకు అండగా నిలిచేది సీఎం కేసీఆరే అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ -కొంపల్లి మున్సిపాలిటీ పరిధులకు చెందిన 94 మంది లబ్దిదారులకు శనివారం గండిమైసమ్మ తహశీల్ధార్ కార్యాల యం వద్ద రూ.94,10,904 విలువ గల కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితు ల్లో కూడా పేద ప్రజలకు అండగా దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఎం తటి విపత్తు వచ్చినా పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. పేదల సంక్షేమాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదనీ, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెం టనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పేదల పెన్నిధిగా మారాడని చెప్పారు. అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగ రాజ్ యాదవ్, తహశీల్దార్ భూపాల్, డిప్యూటీ తహశీల్దార్ సుధాకర్, వైస్ చైర్మెన్ తుడుం పద్మారావు, భౌరంపేట్ పీఏసీఎస్ చైర్మెన్ మిద్దెల బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, మాదాస్ వెంకటేశం, అనంత స్వామి, మహేందర్ యాదవ్, భరత్ కుమార్, ఆనంద్, రాముగౌడ్, గోపాల ్రెడ్డి, మాజీ సర్పంచ్ కావలి గణేష్, నాయకులు బుచ్చిరెడ్డి, హనుమంత్‌రావు, ఆంజనేయులు, సంజీవరెడ్డి, కొల్తూరి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.