Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ సర్కిల్ సీపీఐ(ఎం) కమిటీ ఆధ్వ ర్యంలో శనివారం రామంతాపూర్ రాజేంద్రనగర్ చౌరస్తా వద్ద చిరు వ్యాపారుల వాహనం నాలుగు చక్రాల బండిపై బైకుని ఎక్కించి బండిని తాడుతో లాగుతూ నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా ఎర్రం శ్రీనివాస్, నాయకులు మో డీ సర్కార్కు నిరసనగా నినాదాలు చేస్తూ వాహనాన్ని లాగుతూ నిరసన తెలియజేశారు. కేంద్రంలో మోడీ ప్రభు త్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కరోనా విపత్తులో ఏడాది కాలంగా ఉపాధి లేక అనేక ఇబ్బందు లకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో పెట్రోల్ ధర పెంచడం దుర్మార్గమనీ, విపత్తు సమయంలో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తో ందన్నారు. ఈ సమయంలో కుటుంబానికి ఆర్థిక సాయం చేయకపోవడమే కాకుండా పెట్రో ధరలను అదుపు చేయక పోగా ప్రజలపై భారాలు మోపుతున్నదని విమర్శించారు. పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ ఎర్రం శ్రీనివాస్ ఉప్పల్ కార్యదర్శి డిమాండ్ చేశారు. ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వై.వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ నాయకులు ఆర్.సంతోష్, శ్రీనివాస్, కృష్ణ జిలా నీ, నవాజ్, తదితరులు పాల్గొన్నారు.