Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పించా లని సీఐటీయూ నాయకులు మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎం ప్లాయీస్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఎంఎన్జె క్యాన్సర్ ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్లు, డైరెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంకితభావంతో రోగులకు సేవ లు అందిస్తున్నారనీ, వీరి పట్ల ప్రభుత్వం వివక్షత చూపడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వీరి సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్ర మంలో మెడికల్ అండ్ హెల్త్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కార్యదర్శి కుమారస్వామి పాల్గొన్నారు.