Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- జెడ్పీ పాఠశాలలో వ్యాక్సినేషన్ ప్రారంభం
నవతెలంగాణ-బడంగ్‌పేట
ప్రభుత్వం కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బడంగ్పేట్లో జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. 10 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో చిరువ్యాపారులు, కిరాణా షాపులు, మ ద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో పని చేసే సిబ్బ ందికి ప్రాముఖ్యత ఇస్తూ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభి ంచినట్టు తెలిపారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశా లలో మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపడుతూ మొక్కలను నాటుతుందని మంత్రి తెలిపారు. చెట్లను నరకకుండా కఠిన చట్టాలు తీసుకొచ్చిందనీ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అడవుల శాతం గతంలో కన్నా పెరిగిందన్నారు. కాలుష్యాన్ని అపకుంటే భవిష్యత్ తరాలు స్వచ్ఛమైన గాలిని పొందలేరనీ, ప్రతి ఒక్కరూ ప్రతి ముఖ్య సందర్భ ంలో మొక్క నాటి సంరక్షించాలన్నారు. చెట్లను కాపాడితే అవి మనల్ని కాపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బడం గ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారి జాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిష నర్ కృష్ణ మోహన్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.