Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ శ్వేతా మహంతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న అన్నిరకాల దరఖాస్తులన్నింటినీ ఈనెల 9లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ.. భూమి ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను ఈనెల 9వ తేదీలోపు, ప్రొహిబిటరీ భూములకు సంబంధించిన వాటిపై దృష్టి సారించి ఈనెల 20వ తేదీలోపు పూర్తి చేస్తామని ఆమె సీఎస్‌కు వివరించారు.