Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా నేపథ్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, వృద్ధాప్య పెన్షన్లు అందజేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ బాగ్గొరపు దయానంద్, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తలు అన్నారు. శనివారం లక్డీకాపూల్‌లోని వాసవి సేవా కేంద్రంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 300 మందికి నిత్యావసర సరుకులు, 200 మందికి వృద్ధాప్య పెన్ష్న్లను అందజేశారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పుట్టిన రోజు సందర్భంగా నిరుపేదలకు సాయం చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. కరోనా కష్టకాలంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎమ్మెల్సీ బి.దయానంద్ తెలిపారు. కార్యక్రమంలో వాసవి సేవాకేంద్రం అధ్యక్షులు ఆనంపల్లి రవికుమార్, కోశాధికారి పంపాటి జ్ఞానచందర్, కె.మల్లికార్జున్, సి.మర్ణ అశోక్ కుమార్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు, సేవా కేంద్రంలో పనిచేస్తున్న వారికి నిత్యావసర సరుకులు అందజేశారు.