Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులకు వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మలా ్లరెడ్డి అన్నారు. శనివారం ఫిర్జాదీగూడ, బోడుప్పల్లో స్థానిక మేయర్లతో కలిసి నతనంగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్క రికీ వ్యాక్సిన్ అందించి కరోనా కట్టడికి పాటుపడుతూ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలి పారు. రైతు బజార్, కూరగాయాల వ్యాపారులు, పం డ్లు, పూల విక్రయదారులు, మాంసం దుకాణాల్లో పని చేసే వారు, స్ట్రీట్ వెండర్స్, హౌటల్, ఇస్త్రీ, సెలూన్, మెడికల్ షాపుల్లో పని చేసే వారందరినీ సూపర్ స్సైడర్లుగా గుర్తించామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించి కరోనాను నిర్మూలిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సా మల బుచ్చిరెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, జిల్లా డీఎంహెచ్ఓ మల్లిఖార్జున్, నారాయణ్‌రావు, కమి షనర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ బోడుప్పల్ నగర అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, పీర్జాదిగూడ నగర అధ్యక్షులు దర్గా దయాకర్రడ్డి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, పీహె చ్‌సీ డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ
బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని 15 వ డివిజన్ మహాలక్ష్మీ నగర్లో ఉన్న సమస్యలను పరిష్కరి ంచేందుకు అధికారులకు అదేశాలు జారీ చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శని వారం బోడుప్పల్లో పర్యటించిన సందర్భంగా కాలనీ లో ఉన్న సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకు రావడంతో స్పందించిన మంత్రి స్థానిక కమిషనర్‌కు తక్షణమే పరిష్కరించాలని అదేశించారు. పోచమ్మ గుడి వెనుకాల ఉన్న పార్కు స్థలాన్ని అణ్యాక్రాంతం కాకుండా చూడాలని కమిషనర్‌ను అదేశించారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలను దశల వారీగా పరిష్కరించేలా చర్యలు తీసు కుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నగర అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పోరేటర్ కొత్త దుర్గమ్మ, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్‌కుమార్, కాలనీ వాసులు పాల్గొన్నారు.