Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బ్లెస్ ఇండియా అనే సామాజిక సంస్థ చొరవతో ప్రీతాజీ అండ్ కృష్ణాజీ కుమార్తె, ఆమె సంస్థ లోకా ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో 5వేల కోవిడ్ సేఫ్టీ కిట్లను పంపిణీ చేయడానికి నిర్ణయించారు. టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డిని సంప్రదించి తగిన సహకారం అందిం చమని కోరారు. అందుకు వెంటనే స్పందించిన రాజేఖర్‌రెడ్డి వారిని అభిందించారు. శనివారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ టీఆర్ ఎస్ కార్యాలయంలో రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు కోవిడ్ సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మం త్రి మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ చేస్తు న్న సమాజ సేవ గొప్పదన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయ డానికి సామాజిక సంస్థలు ముందుకు రావాలనీ, ప్రభుత్వం తరుపున సామాజిక సంస్థలకు కావాల్సిన అనుమతులు వెం టనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అందేలా చూస్తామని తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో కరోనా నియంత్రణ చర్యలు పటిష్ఠంగా అమలు చేస్తోంద న్నారు. జూతీవఙవఅ్ఱశీఅ ఱర bవ్్వతీ ్‌ష్ట్రaఅ షబతీవ అనే ఆంగ్ల నానుడిని నేడు నిజం చేస్తూ మానవాళి మనుగడకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నందుకు ప్రతినిధులను అభినం దించారు. వేగంగా స్పందించిన రాజశేఖర్‌రెడ్డికి బ్లెస్ ఇండి యా ఫౌండేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చి రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.