Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
నాటిన మొక్కను సంరక్షిద్దాం మొక్కలకు ప్రాణం పోసి ధరిత్రిని రక్షించుకుందాం అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంద ర్భంగా శనివారం ఎమ్మెల్యే పలువురు పోలీస్ ఉన్నతాధికా రులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగ ంగా ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు నుంచి చింతలకుంట వరకు సైకిల్ ఎమ్మెల్యే సైకిల్ తొక్కారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ప్లాస్టిక్‌ను నిషేధించి జ్యూట్ బ్యాగ్స్ వాడాలని సూచి ంచారు. ప్రకృతిని ప్రేమించి, పరిరక్షిస్తూ మనుషులందరూ ఏ రోగం లేకుండా జీవిస్తారని చెప్పారు. పర్యావరణ పరి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా తమ, తమ బాధ్య తగా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కోరా రు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యన్ని తగ్గిం చాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని తెలి పారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని ఆకు పచ్చగా చేశారని తెలిపారు. సీఎం ప్రయత్నా నికి తోడుగా మనం కూడా ఇంకో 14 శాతం పచ్చదనం పెంచాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో గుర్తించి, ఆ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీవాసులు తమ బాధ్యత, విధిగా తమ ఇంటి ముందు మొక్కలు, ఇంకుడు గుంతలు ఎర్పాటు చేసుకోవాల న్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్ తరాలకు నీటి కొరత ఉండదన్నారు. ఇది ఒక సమాజసేవగా భావించి ప్రతి ఒక్క రూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయంలో సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువై పులా, విద్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, మార్కెట్ యార్డులో, వ్యవసాయ క్షేత్రంలో, స్మశానవాటికలో, గ్రేవీ యార్డులో, పరిశ్రమలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటా లని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, విద్యు త్ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువ జన సంఘాలు, డ్వాక్రా మహిళలు ఈ కార్యక్రమంలో తమ వంతుగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్, పురుషోత్తంరెడ్డి, సీఐలు అశోక్ రెడ్డి, మురళీ మోహన్, రవి కుమార్, సీతారాం, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, చింతల రవికుమార్ గుప్త, టంగుటూరి నాగరాజు, ఖైసర్, ప్రతిక్, తదితరులు పాల్గొన్నారు.