Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఆఫ్‌లైన్‌కే మొగ్గు చూపుతున్నట్టు ప్రముఖ ఆర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ, రాయల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ కడారి రమేష్ పేర్కొ న్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడు దల చేశారు. కరోనా వల్ల నగరంలోని కోచింగ్ సెంటర్స్ అన్నీ మూతపడ్డాయనీ, అయితే కొన్ని కోచింగ్ సెంటర్స్ ఆన్లైన్లో తరగతులు బోధించడం మొదలు పెట్టాయని తెలిపారు. దాదాపు 60 శాతానికిపైగా విద్యార్ధులు ఆన్లైన్ విద్యకంటే ఆఫ్‌లైన్ లోనే పాఠాలు బాగా అర్థమవుతున్నట్టు పేర్కొన్నారు. ఆన్లైన్ విద్యలో విద్యార్థి, ఉపాధ్యాయుని ప్రత్యక్ష సంభాషణ ఉండకపోవడంతో విద్యార్ధికి వచ్చే సందేహాలను అప్పటికప్పుడు నివృత్తి చేసుకోలేకపో వడం, ఏకాగ్రత లోపించడం, సరదాగా ఏదో చూస్తున్నట్టు అనిపిం చడం, వెరసి కరోనా సెకండ్‌వేవ్ తగ్గుముఖం కాగానే విద్యార్ధులు ఆఫ్‌లైన్‌కే వస్తారని తెలిపారు. విద్యార్ధులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే అది ఆఫ్‌లైన్ తరగతులే అని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాగానే కోచింగ్ సెంటర్స్ నిర్వాహకులు తరగతులు నిర్వహించేందుకు ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.