Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంతర్జాతీయంగా అభిమానించే ఫెయిరీ ముప్పెట్ అబ్బీ కడబ్బీ నుంచి అమితంగా ఆకట్టుకునే ద్వయం అయిన ఆద్య, సితార- సెసామీ వర్క్‌షాప్ ఇండియా తెలుగు యూ ట్యూబ్ ఛానెల్ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఎడ్యు టెయిన్మెంట్ కంటెంట్‌ను ఈ వేసవిలో అందుబాటులోకి తీసుకువస్తోంది. తెలుగు చిన్నారులు తెలివిగా, శక్తివంతంగా ఎదిగేందుకు సహాయపడుతూ నూతన శ్రేణి ఫర్రీ, ఫన్నీ కంటెంట్‌ను జోడించింది. యానిమేటెడ్ సిరీస్‌లు మొదలు లైవ్ యాక్షన్ ముప్పెట్ విభాగాల వరకూ, ఈ తెలుగు యూ ట్యూబ్ ఛానెల్ ఇప్పుడు అమితంగా ఇష్టపడే ముప్పెట్ క్యారెక్టర్లు.. అబ్బీ, కుకీ మానెస్టర్, ఎల్మో, చమ్కీలతో కూడిన ఆకర్షణీయమైన నిధిని చిన్నారుల కోసం తీసుకు వచ్చింది. ఇటీవలనే ప్రారంభమైన సెసామీ వర్క్‌షాప్-భారతదేశపు తెలుగు యూ ట్యూబ్ ఛానెల్ ఇప్పటి వరకూ 51 ప్రతిష్టాత్మకమైన సెసామీ స్ట్రీట్ వీడియోలను విడుదల చేసింది. వీటిని తెలుగులో డబ్ చేయగా ఇప్పటికే 1.9 మిలియన్ వ్యూస్ లభించాయి. తెలుగు యూట్యూబ్ ఛానెల్ వినోదం, సంతోషాన్ని మరింతగా విస్తరిస్తూ అంతర్జాతీయ వీడియోలను ప్రస్తుతం తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తోంది. సెసామీ వర్క్‌షాప్-ఇండియా ఇప్పుడు తమ ఒరిజినల్ ప్రీమియర్లను ఆద్య, సితారాల సహకారంతో చేయనున్నారు. సెసామీ వర్క్‌షాప్-ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సోనాలీ ఖాన్ మాట్లాడుతూ ప్రత్యేకంగా నేడు చిన్నారులు నడుమ సృజనాత్మకత, ఆసక్తి, పట్టుదలను పెంపొందించడం అత్యంత కీలకాంశమని, వారిని దృష్టిలో పెట్టుకుని తమ కంటెంట్‌ను ప్రత్యేకంగా చిన్నారుల కోసం తీర్చిదిద్దామని తెలిపారు.