Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉన్న శ్రద్ధనే నిదర్శనం అని విద్యా శాఖ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లో దాదాపు రూ.63.50 లక్షల నిధులతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ, ఓపెన్ జిమ్, తదితర అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కార్పొరేటర్లకు, నాయకులకు సూచించారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌవాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెండ్యాల శివపార్వతి, ఇతర కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, నాయకులు, వివిధ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.