Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి గారు మమ్మల్ని బతుకనియ్యండి
- పైస పైస పోగుచేసి ప్లాట్లు కొన్నాం.. ఇప్పుడు మీ ప్లాట్లు కావు అంటూ భయబ్రాóంతులకు గురిచేస్తున్న
- పీర్జాదిగూడ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు
- దోచుకోవడానికి జతకట్టిన పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ సహా 21మంది కార్పొరేటర్లు
- తమను ఆదుకోవాలని బాధితుల ఆవేదన
నవతెలంగాణ-బోడుప్పల్ :
కాపాడే వాడే కాటు వేయడానికి సిద్ధమవుతున్నాడు, మూగ జీవాల లాంటి మాపై తోడేళ్ళ లాంటి ప్రజా ప్రతినిధుల వేట ప్రారంభం కాబోతుంది సార్. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సార్, కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి సార్ మమ్మల్ని కాపాడండి అంటూ బాధితులు బోరున విలపించారు. పైసా పైసా కూడపెట్టుకొని ఇళ్ల స్థలాలు కొనుక్కొని, గహ నిర్మాణాలు చేసుకుందా మని అనుకుంటే ప్రజాప్రతినిధులు రాబందుల్లా మీద పడి ఇల్లు కట్టుకొనివ్వడంలేదని, వారి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా స్థానిక మంత్రి మల్లారెడ్డికి, మేయర్ జక్కా వెంకట్ రెడ్డికి, స్థానిక కార్పొరేటర్ బండి రమ్య సతీష్గౌడుకి తమ గోడు వెళ్లబోసుకు న్నామని అయినా సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడుతున్నారని బాధితులు ఆరోపించారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాలకు అడ్డాగా మారింది అనడానికి ఇదో మచ్చుక మాత్రమే. కార్పొరేషన్ పరిధి 16వ డివిజన్లో బాధితులు ఆదివారం విలేకరుల సమావేశంలో తమ గోడును వెళ్లబుచ్చారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సర్వే నెంబర్ 79/2, 122/2, 124/2, 125/2లలో ఉన్న 14 ఎకరాలలో 7ఎకరాలు 20గుంటలలో రెండు లేఅవుట్లుగా శ్రీపాద ఎంక్లేవ్, విష్ణుపురి ఎంక్లేవ్ కాలనీలు ఉన్నాయని, అందులో సుమారు 230 ఫ్లాట్లు ఉండగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధుల మధ్య లేఅవుట్‌కు సంబంధించిన వ్యక్తికి మధ్య సయోధ్య కుదరడంతో కొన్ని ఫ్లాట్లకు ఎన్ఓసి జారీ చేయడంతో సుమారు 110 మంది ఇళ్ల నిర్మాణం చేపట్టి నివాసం ఉంటున్నారని అన్నారు. లేఔట్ల ప్రకారమే మురుగునీటి వ్యవస్థ, సీసీి రోడ్లు, పార్కులకు కంచె వేయడం జరిగిందని అన్నారు. ఈ తతంగం జరుగుతున్న సమయంలోనే డి.మల్లికార్జున రెడ్డి, మహేష్ నారాయణ ఇద్దరు వ్యక్తులు సంబంధిత సర్వేనెంబర్లో ప్లాట్లు, ఇండ్లు ఉన్నప్పటికీ వ్యవసాయ భూమిగా చూపించి ఉప్పల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయకుంటే, ఎల్బి నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో 2016లో రిజిస్ట్రేషన్ చేసుకుని, 2019 సంవత్సరంలో దొంగ లేఅవుట్ సష్టించి ఫ్లాట్లు అమ్మే ప్రయత్నం చేయగా న్యాయస్థానం ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. సామాన్యులను ఇబ్బంది పెట్టాలని డిప్యూటీ మేయర్, 21మంది కార్పొరేటర్లు ఏకమయ్యారు. న్యాయబద్ధంగా కొన్న ఇంటి స్థలాలకు అనుమతి ఇవ్వాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మేయర్‌ని కలిసి విజ్ఞప్తి చేయగా, సదుద్దేశంతో అనుమతులు జారీ చేశారని, కానీ ఇది గిట్టని డిప్యూటీ మేయర్ 21మంది కార్పొరేటర్లు తమకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిండికేట్‌గా మారి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. పలు మార్లు డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్‌గౌడ్ తమను పిలిపించి హెచ్చరికలు జారీ చేశారని, కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని కోర్టు ఆదేశాల మేరకు శిరసావహిస్తానని డిప్యూటీ మేయర్‌కు తెలిపామని, అయినప్పటికీ కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేటర్ బచ్చారాజు, టీఆర్ఎస్ నాయకుడు వీరమల్ల సత్య నారాయణ టౌన్ ప్లానింగ్ అధికారులుగా అవతార మెత్తి ఇల్లు నిర్మించుకునే వారి దగ్గరకు వచ్చి భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని, డిప్యూటీ మేయర్‌తో సెట్టింగ్ చేసుకోకుంటే ఇక్కడ ఇల్లు కట్టేది లేదని తేల్చి చెబుతున్నారు అని బాధితులు అన్నారు. న్యాయ బద్ధంగా కొన్న తమ ఇండ్ల స్థలాలకు ప్రజాప్రతినిధులే అండగా ఉంటారు అనుకుంటే వారే రాబందుల్లా వ్యవహరిస్తున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పిం చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద ఎంక్లేవ్, విష్ణుపురి ఎంక్లేవ్ కాలనీవాసులు పాల్గొన్నారు.