Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
లాక్డౌన్లో ప్రజలను ఆదుకోవా లని శనివారం బీజేపీ నాయకులు మూడో వార్డు మడ్ ఫోర్ట్ ప్రాంతం లో 200ల పేద కుటుంబాలకు 750కిలోల కూరగాయలను పం పిణీ చేశారు. బీజేపీి సీనియర్ నాయకుడు కపిల్ బారాబరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నాగేష,్ బి.ఎన్ శ్రీనివాస్ 3వ వార్డు అధ్యక్షుడు కనకరాజ శంకర్ అల్లం నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ మాట్లాడుతూ సేవా ఈ సంఘటన కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు