Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పత్రికా విలువలను దిగజార్చేలా వ్యవహరిస్తున్న ఓ ప్రముఖ పత్రిక తీరుపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పింక్ మీడియా హటావో, తెలంగాణ బచావో, ఈటల రాజేందర్‌కు అడ్డెవ్వడు అంటూ ఆగ్రహించారు. (అది నమస్తే తెలంగాణ పత్రిక కాదు) గులాబీ దొంగల ఊడిగం చేసే కరపత్రం అంటూ హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాలపై దొరల పత్రికల తప్పుడు రాతలు నశించాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మిగారి ఆంజనేయులు, దర్శనం జాన్, ఎర్ర స్వామి, సురేష్ యాదవ్, శ్రీనివాస్ జోగిపల్లి, శ్రీకాంత్ నాయక్ శ్రీకాంత్ రజక పాల్గొన్నారు.