Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నానాటికి ఔన్నత్యాన్ని కోల్పోతున్న
ఆర్ట్స్ కళాశాల
- అంతర్గత మరమ్మతులు ఎవరి కోసం?
- వానపడితే 40 శాతం చిత్తడే
- పురావస్తు శాఖ సలహాలు సూచనలతోనే మరమ్మతులు చేపట్ట్టాలన్న నిపుణులు
- అవసరం లేకున్నా లెక్కకు మించి ఏసీిల వినియోగం
- నూతన వీసీ ఏం చేస్తారో వేచిచూడల్సిందే
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అని తెలంగాణ రాష్ట్రం కోసం మలి తొలివిడత పోరాటం చెప్పక తప్పదు. ఎన్నో ఉద్యమాలకు, ఉపాధి కల్పనకు, కెేరాఫ్ అడ్రస్ కాకుండా ఈ కళాశాల సుమారు 103 ఏళ్ల ఒక చారిత్రాత్మక హెరిటేజ్ బిల్డింగ్ కావటం విశేషం.
వన్నె తగ్గుతున్న నిజాం నజరాణ : ఓయూ ఆర్ట్స్ కళాశాల గడచిన 10సంవత్సరాల నుండి అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. పట్టించుకొనే నాధుడు లేక ఈ చరిత్రాత్మక భవనం నానాటికీి చారిత్రాత్మక ఆనవాళ్లు, రూపాన్ని , ఔన్నత్యాన్ని కోల్పోతుం డటటం పట్ల పలువురు ఆచార్యులు, విద్యార్థులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని పరిరక్షణకు ఓయూ పాలకులు కనీసం శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది.
కురుస్తున్న కళాశాల : ఆర్ట్స్ కళాశాల గత కొన్నాళ్లుగా పలు చోట్ల కురుస్తు ఉండటం, కొన్ని చోట్ల్ల లీకేజీలు కావటం, మరికొన్నిచోట్ల పగుళ్ళు, ఫీనిషిింగ్లు ఉడిపోవటం జరుగు తోంది. మరి ఈ విషయం అధికారులకు తెలియదా అంటే తెలుసు. కానీ ఆదిశగా నివారణకు చర్యలు తీసుకోవటంలో వారి అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే నానాటికీి ఆర్ట్స్ కళాశాల భవనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. సెంటినరీ వేళా పలు సంస్థల నుండి దీనిపై ఉన్న మరకలు, పలు నాచు, పగుళ్లు,ఫెన్సింగ్ కోసం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పి పలు సంస్థలతో డేమోలు సహితం నిర్వహించినా అది అంతవరకే పరిమితం కావటం విశేషం.
శాశ్వత చర్యలు లేకుండా అంతర్గత మరమ్మతులేల?
ఆర్ట్స్ కళాశాల పైన రూఫ్ 40శాతం కురుస్తున్నా ,పైన పలు చోట్ల నీరు నిలిచి ఉన్నా, మరికొన్ని చోట్ల్ల ''టార్పెల్ట్'' ఊడిపోవడం, మరి కొన్నిచోట్ల పగుళ్లు సహితం ఏర్పడి, శుభ్రం చేసే నాధుడు లేక రూఫ్‌పై కొంత వ్యర్ధాలతో నిండిపోయినా, రూఫ్ పై ఉన్న రెండు వాటర్ ట్యాంక్స్ పగుళ్లు వచ్చి, నిత్యం నీరు లీకేజీ కావటం, కొన్నిచోట్ల ఉన్న భారీ ఐరన్ సపోర్ట్ స్తంభాలు తుప్పు పట్టిపోయినా కనీసం తాత్కాలికమైన చర్యలు సహితం చేపట్టని దుస్థితి నెలకొంది. మరోవైపు ఇటివలే సంవత్సరం క్రితం నుండి కురుస్తున్న రూఫ్‌కు మరమ్మతులు చేపట్టకుండా కళాశాలలో అంతర్గతం గా రూ.ఒక కోటి యాభై లక్షల వ్యయంతో గడచిన మూడు సంవత్సరాల నుండి మరమ్మతులు చేసిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. అధికారులు రూఫ్ పట్ల నిర్లక్ష్యం, అలసత్వం ఎందుకు వాహిస్తున్నారో ప్రశ్నగానే మారింది. మరోవైపు లోపాల టాయిలెట్స్, ఆధునికీకరణ, తమ తమ రూమ్స్ మరమ్మతులు చేపట్టి, ఉడిపోతున్న పెచ్చులు తొలగిచి మరమ్మతులు చేస్తున్న అధికారులు మాత్రం ప్రధానంగా కురవకుండా, లీకేజీలు లేకుండా రూఫ్‌ను మర మ్మతుల కోసం చర్యలు చేపట్టకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. పైన శాశ్వత నివారణ చర్యలు తీసుకోకుండా, లోలోపల మరమ్మతులు ఎవరి ప్రయోజనాల కోసమే అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైన అర్థ్ధరహితంగా చేస్తున్న లోపలి పనులు నిలిపివేసి, వెంటనే పైన 40శాతం కురుస్తున్న రూఫ్‌కు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేసి రూఫ్ కురవ కుండా పరిరక్షించాలని కళాశాల ఔనత్యన్ని కాపాడేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని, లీకేజీలు, పగుళ్లు, ఉడిపోతున్న పెనీసింగ్ ఉడిపోకుండా చర్యలు చేపట్టాలని, హెరిటేజ్ భవనంకు మరో కొన్ని సంవత్సరాలపాటు భవిష్యత్ తరాలకు అందజేయాల్సి అవరసం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
అంతర్గత పనుల్లో ఆంతర్యం ఏంటి?
పైన రూఫ్ కురవకుండా, లీకేజీ కాకుండ చూడాల్సిన అధికారులు అంతర్గతంగా రూ.కోటి యాభై లక్షలతో మరమ్మతులు చేస్తున్నారు. డోర్స్, విండోస్ పాలిష్, కలర్స్, విండో రిపేర్లు,పెయింటింగ్, ప్లాస్టింగ్, కొన్ని రూమ్స్‌కు ఫ్లోరింగ్స్, రైన్ వాటర్ పైపు లీకేజీ, గ్లాసెస్‌కు లప్పం పూయటం, జాలీలు, రెయిలింగ్ లాంటి మరమ్మతులు చేస్తున్నారు. గత 10 సంవత్సరాల కిందట ఆర్ట్స్ కళాశాలపై రూఫ్ మరమ్మతులు చేపట్టి నాడు వాటర్ ప్రూఫ్ లేయర్ ఏర్పాటు చేశారు. సుమారు ఆర్ట్స్ కళాశాల పై రూఫ్ ఒక ''లక్ష ఫీట్స్ స్క్వేయర్'' ఉంటుంది. ఈ విషయంలో ఓయూ నాటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, నేటి ఓయూ వీసీ నాడు వివరణ కోరగా సీపీడబ్ల్యూడీ బందాలు వచ్చి పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇంత పెద్ద హెరిటేజ్ భవనంకు పురావస్తు శాఖ, హెరిటేజ్ నిపుణుల బందాలు సలహాలు సూచనలు, అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతు న్నారు. ఓయూ బిల్డింగ్ డివిజన్ అధికారులు, ఈఈ, ఎస్ఈలు మాత్రం రూఫ్ మరమ్మతులకు చెరొక విధంగా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆర్ట్స్ కళాశాలలో అంతర్గతంగా ఆయా ఆయా విభాగాల్లో అవసరం లేకున్నా అవసరానికి లెక్కకు మించి 'ఏసీి'ల వాడకం వల్ల పలు మార్లు గోడలు పగలగొట్ట్టటంతో సమస్యలు కొత్తగా ఉత్పన్నం అయి కళాశాల ఔనత్యాన్ని కోల్పోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. గత సెప్టెంబర్ నెలలో భారీగా కురిసిన వర్షాలకు కళాశాలలో పలు రూమ్స్‌లో వర్షం కురిసి పెచ్చులు ఊడిపడ్డాయి. సదరు సమయంలో అక్కడ విద్యార్థులు, సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. కానీ, ఫర్నీచర్, ఇతర వస్తువు మాత్రం డ్యామేజి అయ్యాయి.
సైన్సు కళాశాల సహితం : ఓయూ సైన్సు కళాశాలలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లాంటి హెరిటేజ్ భవనాలు కూడా రూఫ్‌తోపాటు అనేక అంతర్గత సమస్యలు ఎదుర్కొంటు న్నాయి. వాటిని కూడా మరమ్మతులు చేపట్టి సంరక్షించాలని ఆచార్యులు, విద్యార్థులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఓయూ రిజిస్టర్ ల్యాబ్‌లోనే పై ఫ్లోర్ ఉడిపోయి సందర్భంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యార్థులు అన్నారు .
నాటి పూర్వ విద్యార్థి, నేటి వీసీ పరిష్కారం చేసేనా?
ఇటీవలే ఓయూ ఇన్చార్జి వీసీగా ఉన్న అర్వింద్‌కుమార్ ఆర్ట్స్ కళాశాల మరమ్మతులు చేపట్టాలని నిధులు కేటాయించారు. మరి సదరు నిధులు విడుదల అయ్యాయా లేక పెండింగ్‌లో ఉన్నాయో తెలియదు. కానీ మొన్నటి వరకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ఇక్కడే పీజీ, యూజీ, పీహెచ్డీ పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థి ప్రస్తుత ఓయూ వీసీ ప్రొ.రవీందర్ యాదవ్ మాత్రం మరి ఇంతటి చారిత్రాత్మక నేపథ్యం గల ఆర్ట్స్ కళాశాల రూఫ్ మరమ్మతులు ఎంత వరకు చేపట్టనున్నారో వేచిచూడల్సిందే.