Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కరోనా విపత్కర సమయంలో పేదలకు చేయూతనం దించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావ డం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర నాయకులు కొలను హన్మంత్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్‌లోని ప్రసాద్ కాంప్లెక్స్‌లో అర్చకులు, ప్రయివేటు టీచర్లు, మున్సిపల్ సిబ్బందికి సేవహి సంఘటన్లో భాగంగా ఆదివారం ఆయనతోపాటు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్ పాల్గొని నిత్యావసర సరుకులను అంద జేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పరిష వేణు, రాష్ట్ర బీజైవైఎం ప్రోటోకాల్ కన్వీనర్ సాధుయాదవ్, మదాడి కృష్ణారెడ్డి, రంగా శ్రీనివాస్‌గౌడ్, ప్రవీణ్, గోప ినాథ్, మనే సంజీవ్, సందీప్, వేణుగోపాల్, సంజరు, బా బు, అంబదాస్, కండెరావు, సాయి, వినోద్, రంజీత్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.
షాపూర్‌నగర్‌లో...
కరోనా, లాక్డౌన్ కారణంగా పేద ప్రజలకు చేయూ తనందించాలని కేకేఎం చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కూన శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సేవా హి సంఘటన్ కార్యక్రమ ంలో భాగంగా ఆదివారం సూరారం డివిజన్ పరిధిలోని షాపూర్‌నగర్ హెచ్ఎంటీ సోసైటీలో నిర్వహించిన కార్యక్ర మంలో ఆయన పాల్గొని పారిశుధ్య కార్మికులు, పేద ప్రజల కు బియ్యం, నిత్యావసర సరుకలు, ఆహర ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు డివిజన్లలో పేదలకు నిత్యావసర సరుకులను అందజేస్తు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్, నాయకులు బక్క శంకర్‌రెడ్డి, దుర్యోధన్రావు, కూన రాఘవేంద్రగౌడ్, సుశాం త్గౌడ్, నేమూరి రమేష్, చిలకా సురేష్‌గౌడ్, సంగీత, సైదులు, తదితరులు పాల్గొన్నారు.