Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
టీఆర్ఎస్కేవీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వ ర్యంలో ఆటో కార్మికులకు ఆదివారం టీఆర్ఎస్ మల్కాజి గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అందజేశారు. మేడ్చల్‌లోని పార్టీ కార్యాలయంలో దాదాపు 200 మంది ఆటో కార్మికులకు బియ్యం, కూరగాయలు తదితర నిత్యా వసర సరుకులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్కేవీ అనుబం ధ సనాఫీ హెల్త్ కేర్ ఎంప్లాయీస్ యూనియన్, రాణే ఇంజన్ వాల్వ్ వర్కర్స్ యూనియన్, విద్యుత్ కంట్రోల్ సిస్ట వమ్స్ ఎంప్లాయీస్ యూనియన్ల సహకారంతో కరోనా కారణంగా ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్న మేడ్చల్ ప్రాంతంలోని ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లా డుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పేద కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన టీఆర్ఎస్కేవీ యూనియన్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజే శారు. ఒక కార్మికుడు మరొక కార్మికున్ని ఆదుకునే సంప్రదా యం ఆదర్శనీయమని కొనియాడారు. సీఎం ఆటో కార్మి కులు, అసంఘటిత కార్మికుల కోసం అనునిత్యం కృషి చేస్తు న్నారని తెలిపారు. రోడ్డు ట్యాక్స్ మాఫీ చేయడం, ఉచిత ప్రమాద బీమా తదితర సౌకర్యాలు కల్పించారన్నారని గు ర్తు చేశారు. ఆపద సమయంలో కార్మికులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎ స్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, జిల్లా అధ్యక్షు లు ప్రభాకర్, సనాఫీ హెల్త్ కేర్ నాయకులు సత్యనారా యణ, శ్రీ రామ్‌రెడ్డి, రాణే ఇంజన్ వాల్వ్ నాయకులు రమేష్, నాగరాజు, రాజశేఖర్, యాదగిరి, విద్యుత్ కంట్రోల్ నాయకులు సంజీవులు, సాయిలు, ఆటో యూనియన్ మ ండల అధ్యక్షులు పరమేష్ ముదిరాజ్, వెంకటేష్ యాదవ్, కృష్ణ, కాళేశ్వర్గౌడ్, రమేష్ గుప్తా, మహేష్ పాల్గొన్నారు.