Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మయ్సూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 79వ జన్మదినాన్ని పురస్కరించుకుని దత్త పీఠాని కి అనుబంధంగా ఉన్న శ్రీదత్తా హ్యూమన్ సర్వీసెస్ (వాలంటరీ వ్యవస్థ) ధత్తపీఠ ధర్మకర్త శ్రీ నారాయణరావు సారథ్యంలో పేద కళాకారులకు నెలసరి నిత్యావసర వస్తువులు, దోతులు, చీరలు అందజేశారు. రామగోపాల్ పేట్ పోలీసు స్టేషన్ పక్కన గల వాలంటరీ కార్యాలయ ంలో ఆదివారం ఉదయం కరోనా నియమాలను అనుస రిస్తూ 79 మంది కళాకారులకు ఈ సౌజన్యాన్ని అందజే శారు. కరోనా కష్టకాలంలో నానా అగజాట్లకు లోనైన ఈ కళాకారులు స్వామిజీ చిత్రపటానికి మొక్కి వాలంటరీ సేవాదళ కార్యకర్తలకు సజల నయనాలతో తమ కృతజ్ఞత తెలుపుకున్నారు. నాదస్వరం, సన్నాయి, తబలా, హార్మోని యం వంటి వాయిద్య కళాకారులతోపాటు సంగీత నాట్య గురువులు, గాయనీ గాయకులకు ఈ సౌజన్య వితరణ తమ నిత్య సేవా కార్యక్రమాల్లో భాగమని వాలంటరీ వ్యవస్థ సేవా తపస్వి నారాయణరావు పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్‌లో నిత్యం దాదాపు వేయి మందికి ఆహార పొట్లాల వితరణ జరిగిందనీ, ఇప్పటికీ మైసూరులో నిత్యా న్నదానం జరుగుతూనే ఉందని తెలిపారు. ఆరోగ్య శిబిరాల నిర్వహణ, రక్తదాన శిబిరాలు, ప్రతి ఆదివారం దుండిగల్ ఆశ్రమంలో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఉచితంగా ఇవ్వడంతోపాటు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు ఇవ్వడమే కాకుండా ఉచిత ఆపరే షన్లు కూడా జరుగుతాయని నారాయణరావు పేర్కొన్నారు. స్వామీజీ ఆదేశాల ప్రకారం ఆధ్యాత్మిక సాంస్కతిక కార్యక్ర మాల సుసంపన్నత, విరివిగా అనేక రకాల సేవా కార్యక్ర మాల నిర్వహణ ప్రత్యేక తపస్సని ఆయన తెలిపారు. నిత్యం వాలంటరీ కార్యాలయంలో కూడా అన్నదానం నిర్వ హిస్తామనీ, కార్యదీక్షా పరులైన వాలంటీర్లతో చేస్తున్న సేవలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పోలీసు ఉన్నతా ధికారులు, మున్సిపల్ అధికారుల ప్రశంసలు, సేవా పుర స్కారాలు అందుకున్న ధన్యత, సార్థకత, సామాజిక సేవ తమదని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవస్థలో ఎవరైనా వాలంటీరుగా చేరి సేవా కార్యక్రమాల్లో భాగస్తులు కావచ్చని ఆయన తెలిపారు. అయితే ఈనాటి ఈ వితరణ ఎవరి సౌజన్యం కాదనీ, కేవలం వాలంటరీ సేవాదళం కలసి సమకూర్చుకున్నదనీ, సేవాదళ్ కార్యకర్తలకు కృత జ్ఞతలు తెలిపారు. పలువురు వాలంటీర్లు ఈ సేవా కార్యక్ర మంలో పాల్గొని తమ సహకారాన్ని అందించారు.