Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
- వ్యాక్సినేషన్ సెంటర్ సందర్శన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తానని కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివి జన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో గల సరోజిని గార్డెన్ లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ను ఆయన ఆది వారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వాక్సి నేషన్ ప్రక్రియ మొదలు పెట్టిన నాటి నుంచి నేటి వరకు 1,15,251 మందికి వాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు. వాక్సినే షన్ ప్రక్రియ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీకా అందుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి సారి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన వాక్సి నేషన్ ప్రక్రియతో రోజు రోజుకూ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. కరోనా బారీ నుంచి ప్రజల ప్రాణాలు రక్షించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. మంత్రి కేటీఆర్ అవసరమైన అన్ని చర్యలు యుద్ద ప్రతి పాదికన అమలు చేస్తున్నారన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.