Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని హరి హరపురం కాలనీలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు మకుటం సదా శివుడు ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి రామ్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సంకీపల్లి సుధీర్‌రెడ్డి, లింగోజి గూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి హరి హర పురంలో ఉన్న చెరువును ముంపు ప్రాంతాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లో విస్త్రృత పర్యటన చేశామన్నారు. హరి హరపురం ముంపు, ట్రంక్ లైన్, రిజిస్ట్రేషన్ సమస్యలతో డివిజన్ కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. మల్రెడ్డి రామ్‌రెడ్డి మాట్లాడుతూ డివిజన్లో వర్షాలు వస్తే లోతట్టు 14 కాలనీలు హరి హరపురం కాలనీ సహా మునిగిపోతుందని తెలిపారు. ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ, జీహెచ్ఎంసీ అధికా రులు పదేండ్లుగా ఈ సమస్యలు స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్, స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ మాజీ మంత్రులు కేటీఆర్ వచ్చినా మా సమస్యలు తీర్చలేదని తెలిపారు. హరి హరపురం కాలనీ అధ్యక్షులు, సెక్రెటరీ, కాలనీల ప్రతినిధుల సహకారంతో తాత్కాలికంగా ముంపు సమస్య తీరుతుందన్నారు. మరికొన్ని రోజుల్లో ఎంపీ రేవంత్‌రెడ్డి పర్యటించి సమస్యలను తీర్చడానికి ఒక విస్త్రృత స్థాయి అధికారులోతో మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కాలనీ వాసులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు హనుమంతరెడ్డి,సెక్రెటరీ జనార్దన్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, గణేష్‌రెడ్డి, వినరు పటేల్సహా పలువురు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.