Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
లాక్డౌన్ కష్టకాలంలో పేదల ఆకలిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం పంపిణీ చేస్తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఆదివారం బాగ్ అంబర్పేట డివిజన్ కుమ్మరబస్తీలోని రేషన్ షాపులో ఉచిత బియ్యం పంపిణీని స్థానిక కార్పొరేటర్ బి.పద్మ వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారని, వారిని ఆదుకునేందుకు రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచిత బియ్యం అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రేషన్ షాపు డీలర్ లక్ష్మయ్యతో పాటు వివిధ పార్టీల నాయకులు మహేష్, శేఖర్, అజరుకుమార్, సురేష్, బాలు, అనిల్రామ్, సాయినాథ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.