Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డ్ణి
- పీర్జాదిగూడలో జేపీ హాస్పిటల్ ప్రారంభం
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి వారిలో నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రయివేటు, కార్పొరేట్ హాస్పిటళ్లపై ఉందని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల జేపీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా వైరస్‌తో పాటు అనేక రకాల వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జంట కార్పొరేషన్ల పరిధిలో అన్ని వసతులతో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి వారిలో నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో హాస్పిటల్‌ను నిర్వహించాలని సూచించారు. అనంతరం నిర్వాహకులు డాక్టర్.జైపాల్ రెడ్డి, డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలకు వైద్య ఖర్చుల్లో 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్, నేతకాని వెంకటేష్, ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ మంత్రి పీ బాబుమోహన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మర్రి రాజశేఖర్ రెడి.్డ పీర్జాదిగూడ మేయర్ జక్కావెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంబీసీ మాజీ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, టీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్, పీర్జాదిగూడ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి, దర్గా దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు ఎన్.మధుసూదన్ రెడ్డి, సామల పవన్ రెడ్డి హాస్పిటల్ నిర్వాహకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.