Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాల వద్ద మొలకెత్తుతున్న ధాన్యం
- చేతులెత్తేసిన అధికారులు
- కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
రైతు పండించిన పంటలు కళ్ళాల్లో మగ్గుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన కళ్లాలోనే అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, బండరావిరాల, బాచారం, గౌరెల్లి తదితర గ్రామాలలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల్లాలోనే మగ్గుతుం డడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోమవారం అబ్దుల్లా పూర్మెట్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అధికారులు సమయానికి కొనుగోలు చేయాల్సి ఉండగా మిల్లర్లు కొనుగోలు చేయక పోవడం వల్ల రైతుల బతుకులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తూ ఘటనా స్థలం నుంచే రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులతో ఫోనులో మాట్లాడి అంధు కు సంబంధించిన వివరాలు తెలుసుకొని తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవరిస్తూ రైతులను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. 32 రూపాయలు కంటే ఒక్క పైసా అధికంగా హమాలి వసూలు చేయవద్దని స్ఫష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, 40 రూపాయలు హమాలి వసూలు చేస్తున్నారని మండి పడ్డారు. ధాన్యం కొనుగోలు కోసం కనీసం తేమ శాతం 17 ఉండాలని ఉన్నప్పటికీ ఇంకా తక్కువ ఉండాలని కొర్రీలు పెడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. కళాల్లో పేరుకుపోయిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీధర రెడ్డి, పెద్ద అంబర్‌పేట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్‌రెడ్డి, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ భీముని భాస్కర్‌గౌడ్ సర్పంచులు మూల మహేష్ శ్రీనివాసరెడ్డి, పారంద సంతోష కిషన్, మండల కోఆప్షన్ సభ్యులు గౌస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త ప్రభాకర్, నాయకులు పండుగుల రాజు, శ్రీరాములు కొండల్, సురేష్, భాస్కరాచారి, వివిధ గ్రామాల రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.