Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్
నవతెలంగాణ -సుల్తాన్‌బజార్
ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి (బ్లాక్ ఫంగస్ నోడల్ సెంటర్)లో ఇప్పటివరకు 358 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా పూర్తిచేశామని ఈఎన్టీి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్ సర్జరీలు పూర్తయిన రోగులు అందరూ 99 శాతం కోలుకుంటున్నారని అని తెలిపారు. అందరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఆసుపత్రిలో మొత్తం 552 మంది బ్లాక్ ఫంగస్ రోగులు అడ్మిషన్ పొందారని, వీరిలో 358 మందికి సర్జరీలు పూర్తి చేశామన్నారు. నీలోపూర్ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి అనస్తీషియా డాక్టర్ల బందం సహకారం, ఈఎన్టి ప్రొఫెసర్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ ఎల్.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆనంద్ ఆచార్య, డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, డాక్టర్ మనీష్, డాక్టర్ కరుణ, డాక్టర్ శ్రీనివాస్, అనస్తీషిియా డాక్టర్లు డాక్టర్ ఉమ, డాక్టర్ శివ, డాక్టర్ రవి, డాక్టర్ సంజీవ్, డాక్టర్ ఉమాప్రదీప, శ్రీనివాస్, వైద్య శాఖలోని అందరి సహకారంతో ఈ ఘనత సాధించామన్నారు. ఇప్పటివరకు కోలుకున్న 82 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపార