Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులపై పెను ప్రభావం పడుతుందని, దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకా శాన్ని అంటుతాయని, ఈ ధరలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభు త్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ నూతన కూడలి వద్ద నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సత్య ప్రసాద్, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెరుగుదల ప్రత్యక్షంగా రవాణాపై, పరోక్షంగా అన్ని రకాల వస్తు సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని వారు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను నియం త్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని, పెట్రోలు, డీజిల్‌కు వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తాల్లో అత్యధిక శాతం పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తున్న విషయాన్ని వారు గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఉప్పల్ నియోజకవర్గ కార్యదర్శి సీతారామి రెడ్డి, కార్యవర్గ సభ్యులు నరేందర్, రాజా మోహన్, నవీన్, శ్రీవాని, కళా, ఉషా, సుజాత, సునంద, పర్రెల నరేష్, దీపక్‌లు పాల్గొన్నారు.