Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మ ఆసుపత్రిలో విజయవంతంగా ఫ్రీ కోవిడ్ డెలివరీ సేవలు
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని హస్తినాపురం సెంట్రల్ వద్ద గల అమ్మ హాస్పిటల్లో సాధారణ వైద్య సేవలతోపాటు కరోనా నివారణ వైద్య సేవలలో అమ్మ హాస్పిటల్ సేవలు మెరుగ్గా ఉన్నాయని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు విజయవంతంగా సర్జరీ చేసే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో హాస్పిటల్ ఉందని ఆమ్మ హాస్పిటల్ డైరెక్టర్లు వివేక్, అసద్, సుమన్‌లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ అమ్మ హాస్పిటల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలు అందిస్తున్నామని కోవిడ్ విజంభి స్తున్న తరుణంలో గర్భిణులు ప్రసవాలు చేయించు కునేందుకు అమ్మ హాస్పిటల్ మొగ్గుచూపుతున్నారని గర్భిణులకు ఆరోగ్యంపై ఇస్తున్న సలహాలు, సూచన లు మొదలుకొని ప్రసవం చేసేవరకు వైద్యులు తీసుకుంటున్న శ్రద్ధతో అమ్మ హాస్పిటల్ వైపు ఆకర్షితులవుతున్నారని డైరెక్టర్ అసద్ తెలిపారు. కరోనా సమయంలో పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌కి ధీటుగా లాక్డౌన్ సడలింపుల అనంతరం కేసుల సంఖ్య ఉధతం అవుతున్నా ప్రసవం చేయించుకోవ డానికి గర్భిణులు ఆసుపత్రికి వస్తూ పండంటి బిడ్డలకు జన్మనిస్తున్నారని డైరెక్టర్లు వివేక్ సుమన్‌లు తెలిపారు. సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా సిజేరియన్ చేయాలని కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బులు లాగే ప్రయత్నం చేస్తుండడంతో సాధారణ, మధ్యతరగతి ప్రజానీకం మాత్రం అమ్మ హాస్పిటల్ వైపు అడుగులు వేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంద న్నారు. సీజేరియన్ చేయించుకోవాలనే ఆలోచన చేస్తున్న వారికి సైతం భవిష్యత్తులో కలిగే ఆరోగ్య సమస్యలపై వారికి వివరిస్తూ సాధారణ ప్రసవాలు చేస్తున్నామని చీప్ డాక్టర్ గోపికష్ణ పేర్కొన్నారు.
సాధారణ మధ్య తరగతి పేద ప్రజలకు వైద్య సేవలు తక్కువ ఖర్చులతో అందుబాటులో ఉంటున్నాయని, సహజ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్ చాలా సులభం అనే భావన ప్రజల్లో నాటుకుపోయిందని, కేవలం అవసర తీవ్రత ఎక్కువ ఉంటేనే సర్జరీ చేస్తున్నామని లేదంటే సాధారణ ప్రసవానికే తమ హాస్పిటల్ మొగ్గు చుపుతుందని వారు అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం సాధారణ ప్రసవం కోసం వేచి చూసి పలుమార్లు ప్రసవం జరిగే స్థితిని పరిశీలించిన తర్వాతనే అ వసరమైతే సీజేరియన్లు చేస్తున్నామన్నామని లాక్డౌన్లో సైతం మెరుగైన సేవలు కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించగా ..లాక్డౌన్ సడలింపులు జరిగాక సైతం ప్రజలు కరోనా భారిన పడడంతో గర్భిణులకు నెల తమ బిడ్డ ఎదుగుదల ఏవిధంగా ఉందనే ఆందోళన చెందుతున్న సమయంలో గర్భిణులకు ఎలాంటి అంతరాయం కలగకుండా సేవలు అందింస్తున్నామని కరోనా ఉధతంగా ఉన్న ప్పుడు కూడా గైనిక్ వైద్యుల సహకారంతో గర్భిణు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునటున్నామని డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ జయంతి డాక్టర్ కార్తిక్‌లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితు ల్లో కూడా ప్రసవాలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. అదేవిధంగా పేషంట్లు వారి సంబంధీకులు వైద్య సేవల పట్ల సాను కూలంగా వున్నారని హాస్పిటల్ నిర్వాహకులు మరియు డాక్టర్ ల బందం తెలియజేశారు.