Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య ఓ అమ్మాయితో రాసలీలలు అని వచ్చిన వార్తను ఖండిస్తూ ఆయన మున్సిపల్ కార్యాల యంలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సోమ వారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ అల్వాల్ కాలనీ అసోసియేషన్‌కు సంబంధించిన ఒక గ్రూపులో ఆయన కోడలితో ఉన్న ఫోటోలు పొరపాటున గ్రూప్‌లో రావడంతో అవి వైరల్ అయి మీడియాలో ప్రచారం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఇదే అదునుగా తీసుకుని కొందరు వాటిని అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫోటోలు ఇంట్లో పిల్లలు తన మొబైల్ తీసుకుని తెలియకుండా ఆడుకుంటూ ఫార్వర్డ్ చేశారని వెల్లడించారు. తను ఉద్యోగరీత్యా కాని కార్యాలయంలో సిబ్బందితో కానీ, కార్యాల యానికి పనుల నిమిత్తం వచ్చేవారితో కలుపుగోలుగా ఉండి మర్యాదగా ప్రవర్తిస్తానని పేర్కొన్నారు. కార్పొరేటర్లు నాయకులు, మహిళా ఉద్యోగులు కూడా డీసీ తిప్పర్తి యాదయ్య మంచి మర్యాదగా ఉంటారని, ఎవరిపట్ల చెడుగా ప్రవర్తించడని అన్నారు. ఏదో కుటుంబంలోని పిల్లల పొరపాటు వలన తన కోడలుతో దిగిన ఫోటోలు వచ్చి వైరల్ అయ్యాయని తెలిపారు. మీడియా సమావేశంలో పాల్గొన్న మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్‌నాథ్, డీిఈ మహేష్, అల్వాల్ మున్సిపల్ శానిటేషన్ అధికారి జలంధర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అల్వాల్ సర్కిల్ అధ్యక్షులు కొండల్‌రెడ్డి, వెంకటా పురం డివిజన్ అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అసత్య ప్రచారం తగదు : సీపీఐ
జీహెచ్‌ఎంసీి అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య కుటుంబ విషయాన్ని యాదయ్య వ్యతి రేకులు వాడుకొని ఆయన్ను వారి కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేయడాన్ని అల్వాల్ పట్టణ కమ్యూనిస్టు పార్టీ కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తుందని సీపీఐ పట్టణ కార్యదర్శి కె.సహదేవ్ తెలిపారు. యాదన్న నిర్వహించిన మంచి కార్యకలాపాలను ఓర్వ లేక బీజేపీ డిప్యూటీ కమిషనర్‌పై అసత్య ఆరోపణలు వారి కుటుంబ విషయాన్ని రాజకీయాలకు వాడుకోవడం వారి అనైతిక విధానాలకు అద్దం పడుతుందని సీపీఐ విమర్శించింది.