Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహార్‌నగర్
పారిశుధ్య కార్మికులకు అన్నదానం మరియు వృద్ధులకు వ్యాక్సినేషన్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదర్శ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాశ్రమం వై.బాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కోవిడ్్-19 కరోనా విపత్కర సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి, పరిసరాల పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య సంరక్షణకు పాటుపడుతున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మిక సిబ్బందికి సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం వృద్ధాశ్ర మంలోని వృద్ధులకు డాక్టర్ పద్మావతి, నాగరాణి, సిస్టర్ రాణి సమక్షంలో వ్యాక్సినేషన్ టీకా ఇవ్వడం జరిగింది. , స్థానిక జవహార్‌నగర్, కాప్రా, బాలాజీనగర్‌లో గల ఆదర్శ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాశ్రమం నిర్వహకులు బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పారిశుధ్య కార్మికుల సేవలు కొనియాడదగినవని, వారిపట్ల తమకున్న ఉన్న గౌరవభావాన్ని ఎలా చాటాలో తెలియక ఒక్క పూట కడుపునిండా భోజనం పెట్టి, వారిని సంతోష పెట్టాలనే ఆలోచనతో చేపట్టిన అన్నదాన కార్యక్రమమని తెలియ జేశారు. ఇప్పటికే వృద్ధాశ్రమ నిర్వాహణ భారం కష్టంగా ఉన్నా ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ప్రభుత్వ వుద్ధాశ్రమాన్ని సంరక్షిస్తున్నామని అన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, దాతలు, ప్రజలు అపన్న హస్తం అందించి, వృద్ధ్దాశ్రమ సేవలను మరింత గా ముందుకు తీసుకుపోవడానికి మానవతా దృక్పధం తో ముందుకు రావాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దగ్గరుండి టీకా వ్యాక్సినేషన్లను ఇప్పించినందుకు ఈ సందర్భంగా పద్మావతి తగుజాగ్రతలు చెప్పారు. మాస్కులు, శానిటేజర్లు వాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులోనే ఉంటానన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే తగిన సలహాలు, సూచనలు తీసుకొని కరోనా బారిన పడకుండా చూసుకోవాలని కార్యక్రమంలో ఓల్డ్ ఏజ్ సహాయకులు బాలు బహుజన (ప్రజాకళా కారుడు), డాక్టర్ అజిత్ కుమార్, అనురాధ పాల్గొన్నారు.